![]() |
![]() |

శనివారం రోజు నాగార్జున వచ్చి ఒక్కో కంటెస్టెంట్ చేసిన తప్పులని వెతికి గట్టిగా క్లాస్ పీకాడు. అయితే రాగానే బ్లూ టీం కెప్టెన్ ఆదిరెడ్డిని పిలిచాడు. "మీ టీంలో సభ్యులకు ఒక్కో ర్యాంక్ ఇవ్వండి. ఎందుకో చెప్పండి" అని నాగార్జున అన్నాడు. అలాగే రెడ్ టీం లీడర్ గీతుని కూడా చేయమన్నాడు. ఆ తర్వాత గీతు, ఆదిరెడ్డి ల మధ్య జరిగిన గొడవ గురించి నాగార్జున, ఆదిరెడ్డిని అడిగాడు. ఆ తర్వాత ఆదిత్యకి, గీతుకి మధ్య జరిగిన గొడవ గురించి అడిగి తెలుసుకున్నాడు.
"ఒక టీం ఆడిన ఆటను నువ్వు పర్సనల్ గా తీసుకున్నావ్. గీతు నీ కోసం తప్ప ఎవరికోసం కన్నీరు పెట్టుకోలేదు. గీతుకి నువ్వు ఒక ఎమోషన్." అని నాగార్జున, ఆదిత్యతో చెప్పాడు. "ఒక స్మోకర్. ఒక వీక్ నెస్ ఉంది అనే ట్యాగ్ నాకు రాకూడదు." అని ఆదిత్య చెప్పాడు. "ఆట అయిపోయాక కూడా ఆదిత్య తో అలా ఆడుకోవాల్సింది కాదు." అని నాగార్జున, గీతుని అడిగాడు. "నన్ను ఎన్ని మాటలు అన్నా పర్వాలేదు సర్. కానీ నేను నటిస్తున్నాను అని అన్నాడు సర్. దానికి మాత్రం నేను బాగా బాధపడ్డాను సర్" అని గీతు అంది. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, "ప్రతీ మనిషిలో ఏదో ఒకటి మార్చుకోవాల్సి ఉంటుంది. అది ఏంటో ఆలోచించు" అని గీతుతో అన్నాడు. ఆ తర్వాత మెరీనా గురించి రోహిత్ తో మాట్లాడుతూ, "హౌస్ లో అందరి ముందు సారీ చెప్పావా మరి" అని సరదాగా అన్నాడు.
ఆ తర్వాత ఆదిరెడ్డిని మైక్ ఎందుకు విరగొట్టావ్ అని నాగార్జున అడిగాడు. "ఇంటెన్షనల్ గా కాదు సర్. గీతు మీద కోపంతో టీ షర్ట్ తీసేస్తుండగా, మైక్ తీసి పడేసాను సర్. గీతు కమ్యూనికేషన్ లో ఒక లూప్ ని తీసుకొని, దాన్ని ఒక గేమ్ లో భాగం చేయడం. నన్ను ఓడించడం. నేను భరించలేకపోయాను సర్" అని ఆదిరెడ్డి అన్నాడు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, "నువ్వు బాగా ఆడావ్. టీం లీడర్ గా నువ్వు ఎక్స్ట్రీమ్ గా చేసావ్. వేరే లెవల్ పర్ఫామెన్స్ ఇచ్చావ్ అని చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |